Friday, September 20, 2024
HomeతెలంగాణJivan Reddy: ఆర్మూర్ అభివృద్దే నా ఏకైక కర్తవ్యం

Jivan Reddy: ఆర్మూర్ అభివృద్దే నా ఏకైక కర్తవ్యం

"నమస్తే నవనాథపురం" కార్యక్రమంలో ఎమ్మెల్యే

ఆర్మూర్ నియోజక వర్గ అభివృద్దే నా ఏకైక కర్తవ్యమని, కేసీఆర్ దార్శనిక పాలనే తెలంగాణ భవితవ్యమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. “నమస్తే నవనాథపురం” కార్యక్రమంలో భాగంగా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఉదయం గ్రామంలోకి అడుగు పెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు.

- Advertisement -


“జై జీవనన్న, జైజై కేసీఆర్, జై తెలంగాణ”, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా” అన్న నినాదాలతో తల్వేద గ్రామం మారుమోగింది ఆయన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తల్వేద గ్రామం అభివృద్ధి, సంక్షేమ పథకాల మయంగా మారిందన్నారు.

ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాకు పట్టిన భూతం
ఎంపీ అరవింద్ ను ఈ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తాం. అరవింద్ ఏ గ్రామానికి వచ్చినా అడ్డుకుంటాం. పసుపుబోర్డు ఎందుకు తేలేదని నిలదీస్తాం. ఆర్మూర్ నియోజకవర్గంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఎంతని ప్రశ్నిస్తాం. నీకు దమ్ముంటే కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు బంధు, దళితబంధు వంటి పథకాలకు కేంద్రం నుంచి అదనంగా నిధులు తేవాలని డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ నియోజకవర్గానికి నేనేం చేశానో ప్రజల ముందు చెబుతున్నా. ఎంపీగా అరవింద్ ఏం చేశాడో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. పంచగూడ వంతెన, 9బైపాస్ రోడ్లు, ఆర్మూర్ లో 17 మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో ఎంపీగా అరవింద్ వాటా నయా పైస ఉందా?. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు అభివృద్ధి నిరోధకులు. ఈ రెండు పార్టీలకు ఓట్ల కోసం మాయ మాటలు చెప్పి ప్రజలను ఏమార్చడం తప్ప రెండో పనిలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా నిద్రపోయిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారం కోసం కొత్త బిచ్చగాళ్లలా బయలుదేరారు. బీఆర్ఎస్ నిజమైన ప్రజా పక్షం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు శృంగభంగం తప్పదు.


తెలంగాణ మొత్తం గంపగుత్తగా సారు, కారు, కేసీఆర్, బీఆర్ఎస్ వైపే ఉంది. కేసీఆర్ నాయ కత్వమే దేశానికి అసలైన అండాదండ అని ఆయన విస్పష్టంగా చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గ అమ్మలు,అక్కచెల్లెళ్ళు, అయ్యలు, అన్నదమ్ముళ్ల ఆశీస్సులతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టిస్తా అని జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి యమునా ముత్యం, ఎంపిపి సంతోష్ రెడ్డి, వైస్ ఎంపిపి దేవెంధర్, PACs ఛైర్మన్ సుదర్శన్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటీసిలు, తల్వేద గ్రామ సర్పంచు పీఎన్ సాయిరెడ్డి, ఎంపీటీసీ లింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆకుల సాయిలు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యినరాల రాజేశ్వర్, పెర్కిట్ సాయన్న, ఆవులాపురం సాయరెడ్డి, బద్దం సాయారెడ్డి, గంజాల భోజన్న, ఓరెకె రాజలింగం, కెప్టెన్ సాయరెడ్డి, కుమ్మరి మహేష్, రొయ్యల గంగారాం, ఎల్తం చిన్నారెడ్డి, మంకుల లింగయ్య, మారంపల్లి నారాయణరెడ్డి, మారంపల్లి చిన్నారెడ్డి, బుద్దన్నగారి లింగారెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,విడిసి సభ్యులు,యువకులు,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News