Sunday, October 6, 2024
HomeతెలంగాణJogipet: జోగిపేట టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది?

Jogipet: జోగిపేట టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది?

ఆందోల్ నియోజకవర్గం కేంద్రమైన ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో అధికార పార్టీ కౌన్సిలర్ కు, ఛైర్మన్ కు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో వర్గవిభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తోటి కౌన్సిలర్లు 12 మందిని పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ .. ఆయా వార్డులలో వివక్షత చూపుతూ నిధులు మంజూరు చేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపించారు. కొన్ని వార్డులలో సొంత డబ్బులతో పని చేసినప్పటికీ చెల్లించకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని కౌన్సిలర్లు ఆరోపించారు.

- Advertisement -

మరోవైపు ఛైర్మన్ కుమారుడు ప్రత్యక్షంగా కాంట్రాక్టర్లను బెదిరించడంతో పాటు అనుమతి లేని యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ మున్సిపాలిటీకి ఆదాయం రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ ను తప్పించి 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసి జిల్లా కలెక్టర్ శరత్ కు అందజేశారు.

స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. ఛైర్మన్ రెండవ కొడుకు ఎమ్మెల్యే సోదరుడికి కుడి భుజముగా వ్యవహరిస్తున్నాడని మున్సిపల్ పరిధిలో ప్రజల నానుడి. అలాంటి మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే మద్దతు ఎవరికి ఉంది.. ఛైర్మన్ కేనా లేక కౌన్సిలర్లకా అన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News