Thursday, September 19, 2024
HomeతెలంగాణJuly 22nd: 'అమరవీరుల సంస్మరణ ర్యాలీ'

July 22nd: ‘అమరవీరుల సంస్మరణ ర్యాలీ’

6000 మంది కళాకారులతో అమరవీరులకు నివాళి

అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న అమరవీరుల సంస్మరణ ర్యాలీని హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ B R అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం నుండి అమర జ్యోతి వేదిక వరకు ‘అమరవీరుల సంస్మరణ ర్యాలీ’ ని 6000 మంది సాంస్కృతిక శాఖకు చెందిన కళాకారులతో వివిధ కళారూపాలతో ఘనంగా నిర్వహించాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన ఛైర్మన్ లు రసమయి బాలకిషన్, జూలూరి గౌరీశంకర్, దీపికా రెడ్డి, మంత్రి శ్రీదేవి, సంస్కృతిక & పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, MD టూరిజం మనోహర్, పురావస్తు శాఖ అధికారులు నారాయణ, నాగరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలసి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు.

CM KCR ఆదేశాల మేరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నా ఈ ర్యాలీలో తెలంగాణ కళా వైభవాన్ని, తెలంగాణ రాష్ట్రం సాదించిన అభివృద్ధి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశదిశలా చాటాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

6 వేల మంది జానపద, గిరిజన, దక్కనీ కళాకారులు, శాస్త్రీయ కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. డా. B R అంబేద్కర్ గారి 125 అడుగుల భారీ విగ్రహం నుండి అమర జ్యోతి వేదిక వరకు ‘అమరవీరుల సంస్మరణ ర్యాలీ’ ని నిర్వహించి అమరులకు ఘనమైన నివాళి అర్పించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరుగున పడిన తెలంగాణ ప్రాచీన కళలకు పూర్వ వైభవాన్ని తెచ్చామన్నారు. ఈ ర్యాలీలో తెలంగాణకు చెందిన డప్పుల కళాకారులు, ఒగ్గుడోలు, బోనాలు, కోలాటం, గుస్సాడి, కొమ్ముకొయ, లంబాడీ, రాజన్న డోలు, కోలాటం, చిందు యక్షగానం, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, బతుకమ్మలు, షేరి బాజా, మర్ఫాలతో పాటు పేరిణి, కూచిపూడి, భరత నాట్యం, కథక్ వంటి శాస్త్రీయ నృత్య కళాకారులు శకటాలపై తమ కళా ప్రదర్శన లు నిర్వహిస్తున్నామన్నారు. అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News