Saturday, November 23, 2024
HomeతెలంగాణKale Yadayya: మీ ఋణం తీరదు, బిడ్డగా దీవించండి

Kale Yadayya: మీ ఋణం తీరదు, బిడ్డగా దీవించండి

మళ్లీ గెలిపించాలని చేవెళ్లలో ప్రచారం

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళ మండలం ఊరెళ్ళ, ఊరెళ్ళ అనుబంధ గ్రామం మొండివాగు, దేవుని ఎర్రవల్లి, దర్మసాగర్ గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార అనంతరం గ్రామాలలో వారు మాట్లాడుతూ… గ్రామానికి మంజూరు చేసిన నిధులు గ్రామంలో చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు పల్లె ప్రకృతి వనం గ్రామాల్లో మరణించిన రైతులకు రైతు బీమా రైతు బంధు దళిత బంధు అనారోగ్యంతో ఉన్నవారికి సీఎం సహాయనిది చెక్కులు పంపకం ఇతరాత్ర అభివృద్ధి పనులను గ్రామస్తులకు వివరించారు.

- Advertisement -

చేవెళ్ల నుంచి ఊరెళ్ళ తంగెడపల్లి రోడ్డుకు ఇదివరకే నిధులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పనులు ఆగిపోయాయన్నారు. అనుబంధ గ్రామం మొండివాగులో ఇదివరకు చేసిన అభివృద్ధిని వివరాల్లో భాగంగా ఈద్గా, మైనారిటీ కమ్యూనిటీ భవనం డ్రైనేజీ నిర్మాణం రైతు భీమా అభివృద్ధి కార్యమాలు చేశామన్నారు. దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఎన్నికల ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన కూడలిలో గ్రామంలో 2.5కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామస్తులకు వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు అకాల మరణం చెందిన రైతులకు రైతు బీమా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు కంపౌండ్ వాల్ అంగన్వాడి భవనం స్మశాన వాటిక రైతు వేదిక అభివృద్ధి చేశామన్నారు. మీ బిడ్డగా రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీరదన్నారు.

అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేసిన టబిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మరోసారి గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మల్గారి వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మాజీ ఎంపీపీ మంగలి బాలరాజ్, ఊరెళ్ళ సర్పంచ్ జాంగిర్, దేవుని ఎర్రవల్లి సర్పంచ్ సామా మాణిక్య రెడ్డి, రంగారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, వెంకటేశం గుప్తా, లావణ్య శంకర్, యాలల రాజు, నర్సింలు, కేసారం శ్రీనివాస్, షేరి దర్శన్, జంగారెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేష్ మహేష్, తోట చంద్రశేఖర్,బిఆర్ఎస్ నాయకులు కవాడి తిరుపతిరెడ్డి, జూకన్న గారి జైపాల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ఎంపీటీసీ రవీందర్, చందు,రాములు, దండు సత్యం, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, బ్యాగరీ నర్సింలు, శేరి రాజు, కుంచం కుమార్ గుప్తా, మైనార్టీ నాయకులు అబ్దుల్ గని, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవీందర్, నరేందర్ రెడ్డి, రాఘవేందర్, గడ్డమీద శేఖర్, శ్రీనివాస్ రెడ్డి,శ్రీను, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News