చేవెళ్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఊరెళ్లను కూడా మున్సిపాలిటీలో కలుపుతున్నారు అని వార్తలు రావడంతో ఆ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ నిరసన చేపట్టడంతో పాటు ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసి ఉరెళ్ళ గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చొద్దు అని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మా గ్రామ సర్పంచ్ మొహమ్మద్ జహంగీర్, వైస్ ఎంపీపీ కర్నె శివ ప్రసాద్ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడానికి అంగీకరించారన్నారు. గ్రామ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎలా మున్సిపల్ లో కలుపుతామణి ప్రకటిస్తారన్నారు. ఊరెళ్ళ గ్రామం మున్సిపల్ లో కలపొద్దని ఎమ్మెల్యే తో విన్నవించుకున్నారు. మా గ్రామాని పంచాయతీగానే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంచం కుమార్, యాదయ్య, ఎస్ విట్టలయ్య,పెంటయ్య, కావలి శ్రీనివాస్, టీ రాజు, సీ వెంకటేష్, యూసుఫ్, నవీన్, ఎం శ్రీనివాస్, అసిఫ్, ఎ రాజు తదితరులు పాల్గొన్నారు.
Kale Yadayya: ఊరెళ్ల గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దు
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేసిన గ్రామ ప్రజలు