Friday, July 5, 2024
HomeతెలంగాణKale Yadayya: ఆయుధాలు సరఫరా చేసే అభ్యర్థి కావాలా? యాదన్న కావాలా?

Kale Yadayya: ఆయుధాలు సరఫరా చేసే అభ్యర్థి కావాలా? యాదన్న కావాలా?

నామినేషన్ వేసిన కాలే యాదయ్య

చేవెళ్ళ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య నాయకులు అశేష జనసంద్రం మధ్య తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మూడవసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ గెలవబోతున్నారు. చేవెళ్ల నుండి యాదయ్య మూడోసారిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారన్నారు. మరోసారి యాదయ్యను భారీ మెజారిటీతో  గెలిపించాలని చేవెళ్ల ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ…
చేవెళ్ల పౌరుశాల గడ్డ చేవెళ్ల పౌరుషం దెబ్బకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గలంతు కావలి అని అన్నారు.. పాల లాంటి మనసు వున్న యాదన్న కావాలా! ఆయుధాలు సరఫరా చేసే క్రిమినల్స్ కావాలా! చేవెళ్ల ప్రజలు ఆలోచన చెయ్యాలన్నారు. భారీ మెజార్టీతో మరోసారి యాదన్నను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఎందుకు ఆలస్యం జరిగింది. సర్పంచ్ ఎన్నికలకు అలోచించి ఓటు వేస్తాం… కదా! మరి ఎమ్మెల్యేను ఎన్నుకోవడంలో మీరు ఆలోచన చేయండన్నారు. అవతల వ్యక్తి ఏలాంటోడో అలోచించి ఓటు వేయాలన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ…
150 చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తికీ అవకాశం ఇచ్చిందంటే యేంతకు దిగజిరిందో ప్రజలు గమనించాలన్నారు. ప్రజల కోసం కేసులు ఉంటే ఓకే..కానీ మనుషులను చంపిన కేసులు…పరారిలో ఉన్న వ్యక్తి పేరు పైన 30 కేసులు ఉన్నాయని చెబుతున్నారన్నారు. సుపారీ కేసులు ఉన్న వ్యక్తిని ఏమనాలని! భూ దందాలు మర్డర్ కేసులు బెదిరించినవి.. ఆయుధాల కేసులు ఆయన పై ఉన్నాయన్నారు. మరికొన్ని రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళో చేవెళ్ల ప్రజలకు తెలుస్తుందన్నారు.

మతత్వల పార్టీలకు అవకాశం ఇవ్వకుడదని ఊసరవెల్లిలా పార్టీలు మరే నాయకులకు ఓటు వేస్తే చేవెళ్ల అగం అయితదన్నారు. ఊసరవెల్లికి ఓటేస్తే వృధా అని ఆయనకు పార్టీ ముఖ్యం కాదు. పదవే ముఖ్యమన్నారు. సిద్ధాంతాలు లేవు. నైతిక విలువలు లేవు. జనాలు ఏమి అనుకుంటారో అన్న సిగ్గూ లేదన్నరు. ఎప్పుడు ఏపార్టీలో ఉంటాడో తెలియదు. ఏ ఎండకాగొడుగు పట్టడం ఆయన నైజం అన్నారు. అలాంటి వ్యక్తికి వాత పెట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు.

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు 84 గ్రామాల కు గుదిబండగా మారిన 111జిఓను రద్దుచేసి 69 జీ వో వచ్చిందన్నారు. మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఈసి మూసి నదులపై వంతెనలు చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. మరో సారి అవకాశం ఇస్తే హైదరాబాద్ తరహా చేవెళ్లను అభివృద్ధి చేస్తానన్నారు. నా మీద కేసులు లేవు భూ దందాలు చేయాలే నేను సెటిల్ మెంట్లు చేయాలేనని నేను క్రిమినల్ ను అసలే కాదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News