Saturday, November 23, 2024
HomeతెలంగాణKale Yadayya: రెండో విడత గొర్రెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Kale Yadayya: రెండో విడత గొర్రెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపిన గొర్రెల పంపిణీ  పథకం 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని నవాబ్ పేట్ మండలం ఏక్ మామిడి గ్రామంలో గొల్ల కురుమలతో కలిసి లబ్ధిదారులకు 18 యూనిట్లా గొర్రెలను పంపిణీ ప్రారంభించారు ఎమ్మేల్యే కాలే యాదయ్య. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ చరిత్రలో ఏ  నాయకుడూ చేయని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అమలు చేస్తున్నారన్నారు. గొర్రెల పంపిణీ పథకం గొర్ల కాపరుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.

- Advertisement -

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసిందన్నారు. గతంలో తెలంగాణలో మాంసం దిగుమతులు వచ్చేవి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. కులవృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బిసి కులవృత్తిదారులకు బ్యాంకుల ద్వారా షూరిటీ, గ్యారెంటీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. చిరు వ్యాపారులకు కులవృత్తులకు ఇదో గొప్ప అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్ మామిడి సర్పంచ్ రఫీ, మల్లారెడ్డి, నవాబు పేట్ పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ పోలీస్ రామ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పశువైద్యాధికారులు, గొల్ల కురుమ కులసంఘ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News