Monday, July 8, 2024
HomeతెలంగాణKale Yadayya: జవాబుదారితనం లేని పార్టీలు

Kale Yadayya: జవాబుదారితనం లేని పార్టీలు

తెలంగాణపై సవతి ప్రేమ చూపుతూ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ను బిజెపి అడ్డుకుంటుంది

చేవెళ్ల మండల కేంద్రం కెజిఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి లతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి విషయంలో తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపుకు పాల్పడుతుందన్నారు. రైతుల క్షమం కోరుతున్నారా..! కక్ష సాధింపుతో ప్రాజెక్టులు అడ్డుకుంటారా…! అని బిజెపి కాంగ్రెస్ పార్టీలపై ఆయన ఫైర్ అయ్యారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తే..! బిజెపి పార్టీ గ్రీన్ “ట్రిబ్యునల్ లో” పర్యావరణ పర్మిషన్లు ఇవ్వక పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ఎటు కాకుండా బిజెపి కాంగ్రెస్ పార్టీలు సమితి తల్లి ప్రేమ చూపుతున్నాయన్నారు. ఈ పార్టీలు అడ్డుకోకుంటే ఇది వరకే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తియ్యేవన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీళ్లు లేవు. బిఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో బలపడుతుందని జీర్ణించుకోలేక తెలంగాణలోని ప్రాజెక్టుల అభివృద్ధికి అడుగడుగున ఆటంకం కల్పిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించాలని చాలా రోజుల నుండి కేంద్ర ప్రభుత్వంను కోరుతున్నామన్నారు. నిధులు ఇవ్వకుండా పనులు జరగకుండా ప్రాజెక్టు అడ్డుకుంటూ జిల్లా రైతుల నోట్లో మట్టికోడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను చూసి జాతీయ పార్టీలు బయపడుతున్నాయన్నారు. కేసీఆర్ ను ఎదురుక్కొలేక తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం తెలంగాణ రైతాంగాన్ని ఏడిపించడం సమాజసం కాదు అన్నారు. కెసిఆర్ పై తెలంగాణ రాష్ట్రంపై ఎన్ని కుట్రలు చేసినా జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ఎంపిపి మల్గారి విజయలక్ష్మి వెంకటేశ్వర రెడ్డి చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దల ప్రభాకర్ మహేందర్ రెడ్డి మొయినాబాద్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు దేవరంపల్లి సర్పంచ్ నరహరి రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ ఫయాజ్ మల్లారెడ్డి నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News