ప్రభాకర్ జైని నిర్మించిన కాళోజీ డాక్యుమెంటరీ అద్భుతం కాళోజీ జయంతి సందర్భంగా ప్రజా కాళోజీ డాక్యుమెంటరీ తిలకించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా వరంగల్ కు చెందిన సినీ దర్శకుడు ప్రభాకర్ జైని నిర్మించిన ప్రజాకవి కాళోజీ డాక్యుమెంటరీని ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రుల నివాసంలో ఆవిష్కరించి, తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. వారిపై డాక్యుమెంటరీ నిర్మించిన ప్రభాకర్ జైనీ బాగా తీశారు అన్నారు. చిత్రం బాగా ఆడాలని మంత్రి ఆకాంక్షించారు.