Sunday, October 6, 2024
HomeతెలంగాణKalvakuntla Sujith: ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టదా

Kalvakuntla Sujith: ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టదా

నాకు కాల్ చేస్తే, 10 నిమిషాల్లో వచ్చి సాయం చేస్తానంటున్న లీడర్

కోరుట్ల పట్టణంలో వర్షాలకు ఇండ్లు కూలిపోయి ఆస్తి నష్టం జరిగి, ఉండేందుకు ఇండ్లు లేక కట్టుకునేందుకు బట్టలేక, దీన స్థితిలో ప్రజలు బాధపడుతుంటే వారి పరిస్థితి చూసి గుండె తరుక్కు పోతుందని, కోరుట్ల పట్టణంలో ముంపు ప్రాంతాలను పర్యటించి వారి పరిస్థితి చూసి చలించి పోయి, కోరుట్ల తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు ఫోన్ చేసి మాట్లాడి ప్రజలకు యుద్ద ప్రాతిపదిక చర్యలు చేపట్టి ఆదుకోవాలని టీపీసీసీ డిలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సుజిత్ రావు మాట్లాడుతూ వాగు పరివాహక ప్రాతం అయినటువంటి హైదర్ గూడ, బెండపెల్లి, అరఫత్ పుర, గంగంపేట్, మహమ్మదియాపుర, అంబేత్కర్ నగర్, ముబిన్ పుర, సాయిరాంపురా కాలనీ, హజీపురా ప్రాంత ప్రజలకు వర్షాభావం ప్రభావం ఉంది అని విద్యాసంస్థలు సెలవు ఇచ్చిన అధికారులు, ముందస్తు వరద ప్రమాదం ప్రజలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు అని అన్నారు, వార్డుల్లో ఉన్న యూవతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, వార్డులల్లో యూవత తొందరగా అపదని గుర్తించి, జాగ్రత్తపడి వారి ప్రాణాలకు లెక్క చేయకుండా ముంపుకు గురైన ప్రజలను కాపాడిన తీరు చాలా అద్బుతమని, వారు జాగ్రత్తపడకపోతే ఆస్తి నష్టంతో పాటు, ప్రాణ నష్టం జరిగేదే అన్నారు, వరద భీభత్సం జరిగి పట్టణంలో దాదాపు ఎనిమిది వార్డులు పూర్తిగా జలదిగ్బంధం అయి ఒక చోట ప్రాణ నష్టం జరిగి 3 రోజులు గడిచిన ఇప్పటికి ఎమ్మెల్యే, ఎంపీ ముంపు ప్రాంతాలను పర్యటించక పోవడం చాలా బాధాకరం, అధికారులు పాలకవర్గం ప్రత్యేక సమావేశం పెట్టి యుద్ద ప్రాతిపదికన వారిని అదుకోవాల్సిందని.. ఇప్పటికీ వారికి భరోసా ఇచ్చే నాధుడే కరువయ్యారు, పూర్తిగా ఇండ్లు కూలిన వారికి 20 లక్షల ప్రభుత్వ సహాయం, సామగ్రి పూర్తిగా కొట్టుకొని పోయిన వారికి 10 లక్షలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాల ప్యాకెట్లు, నీళ్ల పాకిట్లు ఇచ్చి ఫొటోలు దిగడం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. వచ్చే నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం కోరుట్ల పట్టణములోని చెరువు క్రింద ఉన్న ప్రాంతాలకు వరద ముప్పు నుంచి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

- Advertisement -

ఎవ్వరికి ఏమవసరమున్న నన్ను సంప్రదించండి, మీరు కాల్ చేసిన 10 నిమిషాల్లో మీ వద్ద ఉంటా అని బాధితులకు ఆయన భరోసా ఇచ్చారు. వారి వెంట పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అక్బర్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజియోద్ధిన్, రాష్ట్ర ఫీసర్ సెల్ ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, అబ్బు, అసిఫ్, రహమాన్, ఉమర్ ఖాన్, ఫక్రుద్దీన్, రహీం పాషా, వాసిద్ , ఫైసల్ , ఫెరోజ్, హాబీబ్, ముజ్జు, రాజు, శివ, గంగాధర్, రాజేందర్, నరేశ్, గిరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News