Monday, October 7, 2024
HomeతెలంగాణKalvakurthi: దసరా కానుకగా డబుల్ బెడ్రూం ఇళ్లు- మంత్రి పొంగులేటి

Kalvakurthi: దసరా కానుకగా డబుల్ బెడ్రూం ఇళ్లు- మంత్రి పొంగులేటి

ప్రజా ప్రభుత్వంలో..

ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు మార్పు కోరి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని వెల్దండ, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సిల్లారుపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలను ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ లతో కలిసి రాష్ట్ర రెవిన్యూ సమాచారం గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యాధునిక వసతులతో ఆర్డిఓ ఆఫీసును నిర్మించి, ప్రారంభిస్తామని,
ఇందిరమ్మ రాజ్యం తోనే మార్పు సాధ్యం అవుతుందని, నిరుద్యోగులకు రైతులకు బడుగు బలహీన వర్గాలకు వ్యూహాత్మకంగా పథకాలు అమలు చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో, ఇప్పటికే ఐదు గ్యారెంటీలను పూర్తి చేశామని త్వరలో మిగిలినవి చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని, రైతు రుణమాఫీకి అవసరమైన 31 వేల కోట్లతో పాటు ఆదనంగా 500 కోట్లు ఇవ్వడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.

ధరణి స్థానంలో బలమైన 2024 ఆర్ ఓ ఆర్ చట్టం తీసుకురాబోతున్నామని ప్రతి కుటుంబానికి డిజిటల్ గుర్తింపు కార్డులను ఇచ్చి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందెందుకు ఈ కార్డులు ఉపయోగ పడేవిధంగా ఉంటాయని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను అందించబోతున్నామని విడతలవారీగా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువకులకు ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేశామని,భవిష్యత్తులో కూడా విడుదల చేస్తూనే ఉంటాం అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రజలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుందని, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు మేలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, నిరుద్యోగ యువతకి ఇప్పటికే 61,000 ఉద్యోగాలు ఇచ్చామని, భవిష్యత్తులో కూడా పలు రకాల నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే ఉంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కల్వకుర్తిలో 44 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు రెవిన్యూ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి తెలిపారు. వేలాది మంది విద్యార్థులతో అత్యధిక తరగతి గదులతో విశాల వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నెలకొల్పబోతున్నామని, తెలిపారు.
ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీకి విడుదల చేయడం జరిగిందని, త్వరలోనే 13 వేల కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీకి ప్రభుత్వం చెల్లిస్తుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా ముందు ఉంటుందని, ఇది పేదల ప్రభుత్వమని మంత్రి తెలిపారు.
రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 4000 చొప్పున ఇందిరమ్మ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు అదే విధంగా ప్రతి సంవత్సరం ఇల్లు లేని పేద ప్రజలందరికీ ఇండ్లను కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాని దేనని మంత్రి తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు ఒక మంచి నాయకున్ని ఎన్నుకున్నారని, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవడం ఈ ప్రజల అదృష్టమని మంత్రి అన్నారు. అంతకుముందు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ….
సోమవారం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి చేతులమీదుగా కల్వకుర్తి నియోజకవర్గంలో 44 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని , ఇది కల్వకుర్తి ప్రజలకు ఎంతో ఆనందాన్నిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
కల్వకుర్తి పట్టణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్డీవో కార్యాలయాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే మంత్రికి దృష్టికి విన్నవించుకున్నారు. కల్వకుర్తి పట్టణంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ నుండి విశ్రాంతిభవనాన్ని నిర్మించాలని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News