Thursday, September 19, 2024
HomeతెలంగాణKamareddy: పోరాటం ఫలితంగానే తెలంగాణకు విముక్తి

Kamareddy: పోరాటం ఫలితంగానే తెలంగాణకు విముక్తి

టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా అప్పటి వరకు పల్లెల్లో నెలకొన్న వ్యక్తి చాకిరి, భావవ్యక్తీకరణ పై ఆంక్షలు మాతృభాష అణిచివేత, మతపరమైన నిరంకుశ దూరంలో తొలగి 17 సెప్టెంబర్ 1948 నా హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

- Advertisement -

సెప్టెంబర్ 17 సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఎదుట జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం వేడుకకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇతర ప్రాముకులకు జిల్లా ప్రజలకు తెలంగాణ పోరాట వీరుల కుటుంబాలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగా అప్పటివరకు పల్లెల్లో నెలకొన్న వ్యక్తి చాకిరి, భావవ్యక్తీకరణ పై ఆంక్షలు, మాతృభాష అణిచివేత, మతపరమైన నిరంకుశ దూరంలో తొలగి 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ సర్వమతాలను సమానంగా ఆదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు, పట్టణాలతో ప్రబల ఇల్లు చున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చినా 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది అని చెప్పారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 3. 54 కోట్ల మంది మహిళలకు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని దీని ద్వారా మహిళలకు 69. 98 కోట్లు లబ్ధి చేకూరింది అని పేర్కొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫర చేస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1,56,670 గృహ విద్యుత్తు కలెక్షన్లకు జీరో బిల్లు జారీ చేసినట్లు చెప్పారు ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం 4 కోట్ల 84 లక్షల రూపాయల రాయితీని అందజేసిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,43,899 మంది వినియోగదారులకు 2 లక్షల 97 వేల 121 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం 8 కోట్ల 56 లక్షల రూపాయల రాయితీని అందించిందని చెప్పారు. రైతులకు పంట రుణాల మాపి 20 24 పథకాన్ని ప్రభుత్వము అమలు చేసిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 91 వేల 259 మంది రైతుల ఖాతాల లో 646 కోట్ల 47 లక్షల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు జిల్లాలో 1,09,436 యేసయ్య విద్యుత్తు కలెక్షన్లకు 24 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి నిరంతరం సరఫరా గురించి 25 కే.వి.ఏ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల వరకు ఉన్న వైద్య ఖర్చుల పరిమితిని 10 లక్షల రూపాయల వరకు తమ ప్రభుత్వం పెంచిందని తెలిపారు. అదనంగా ఆరోగ్యశ్రీ పరిధిలో 163 వ్యాధుల చికిత్సలను చేర్చి మొత్తం 1,672 వ్యాధుల చికిత్సలను అందిస్తే పేద ప్రజల ఆరోగ్య సమస్యల కు పరిష్కార మార్గం చూపినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇల్లు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. రైతులకు పంటల బీమా పథకం వర్తింప చేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వ్యవసాయ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ లను నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మీడియా సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు వీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ , ఆశిష్ సాoగ్వన్ ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్ఓ నికిత, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News