పాలేరు నియోజకవర్గంలోనే నాకు అత్యంత ఇష్టమైన గ్రామం పైనంపల్లి, అని గత ఎలక్షన్ లో మీరందరు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి, అత్యధిక మెజారిటీ తో నన్ను గెలిపించారని, దురదృష్టం ఏంటంటే ఆరోజు మనతో ఉన్న గడ్డం సత్యం ఈరోజు లేడని తన అభిమానిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..పేద ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వానికి మనమందరం కలసి మద్దతు ఇవ్వాలని, కొందరు వ్యక్తులు ఎక్కడ నుంచో వచ్చి అహంకారంతో మన పాలేరు ప్రజల ఆత్మగౌరవాన్ని, ఆత్మభిమానాన్ని కొనుక్కోవాలని చూస్తున్నారన్నారు. అలాంటి వారికి మీరందరు సరైన బుద్ధి చెప్పాలన్నారు. కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. చెప్తున్నా ..నాకు ఊపిరి ఉన్నంత వరకు, మీ కోసమే పని చేస్తా, ఉపేందర్ రెడ్డి అనే వాడు జనాల గుండెల్లో ఉంటాడు అన్నారు. మీరందరూ నన్ను ఆశీర్వదించి మరోసారి ఎమ్మెల్యేని చేయాలని కోరారు. అనంతరం స్థానికులు కందాళ గెలుపును కాంక్షిస్తూ చర్చిలో ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపిపి వజ్జ్యా రమ్య, డీసీబీ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య పాల్గొన్నారు.