Friday, October 18, 2024
HomeతెలంగాణKarimnagar: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

Karimnagar: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు

రక్తదానం చేసిన కార్యకర్తలు, అభిమానులు

చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. గంగాధర క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో 30 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.

- Advertisement -

శుభమస్తు ఫంక్షన్ హాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు భోజనం ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంతో పాటు చొప్పదండి నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే పల్లి సత్యం జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

తన జన్మదినం సందర్భంగా బొకేలు శాలువాలు తీసుకురావద్దని ఎమ్మెల్యే సూచన మేరకు నాయకులు కార్యకర్తలు నోట్ బుక్స్, పెన్నులు తీసుకువచ్చి ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేస్తామని తెలిపారు.

తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News