Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

Karimnagar: శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పరస్పర సహకారంతో మెదులుతూ ప్రతి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. కరీంనగర్ ప్రజలు ఐక్యమత్యానికి చిహ్నంగా ఉండాలని చెప్పారు.

- Advertisement -

రాబోవు రంజాన్ పర్వదినం సందర్భంగా నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు లేకుండా శాంతియుతంగా ఉండే ప్రాంతాలే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయన్నారు పండుగల సందర్భంగా ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరగలేదని, ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో ఉండాలని చెప్పారు. ఏవైనా సంఘటనలు జరిగినట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతను తెలుసుకొని ఉండాలని చెప్పారు. అత్యుత్సాహం ప్రదర్శించే చర్యలకు పాల్పడటం ద్వారా ఇబ్బందులు కలుగుతాయని విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇతరుల మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదని కోరారు. మసీదుల వద్ద పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండాలని తెలిపారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ లను ప్రోత్సహించకూడదని చెప్పారు. పైన పేర్కొన్న అంశాలపై మసీదుల్లో ప్రార్థనలు సందర్భంగా ప్రచారం చేయించారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్, ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి గైట్ మహేష్ బాబా సాహెబ్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, విజయ్ కుమార్, ఎస్బిఐ లు జి వెంకటేశ్వర్లు, బి సంతోష్ కుమార్ లతో పాటుగా శాంతి కమిటీ సభ్యులు మధుసూధన్ రెడ్డి, ఎం ఏ రఫీక్, జగదీష్ చారి, ఇనుగుర్తి రమేష్, రాధా కిషన్, మన్సూర్ తవక్కలి,సయ్యద్ ముజఫర్,ఘనశ్యామ్ ఓజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News