శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ వసంతంలోకి అడుగేడిన సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్. హరికాంత్ కామర్స్, ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76 వసంతంలో అడుగిడిన సందర్భంగా కార్యకర్తలకు, విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏబీవీపీ తమదైన శైలిలో విద్యార్థుల్లో జాతీయవాదాన్ని నింపుతూ వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. వివేకానందుని బాటలో ఏబీవీపీ పని చేస్తుందన్నారు. అందుకనే విద్యార్థి పరిషత్ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ విద్యార్థి సంస్థగా నిలిచింది అన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ,370 ఆర్టికల్ రద్దు విషయంలో ఏబీవీపీ పాత్ర ముఖ్యమైనదని అన్నారు. విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే (ఏబీవీపీ) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అక్కడ ఉంటుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంజన్న జెలపెల్లి , కార్యకర్తలు శివ, వీరబాబు, మల్లేష్, శివానీ, మానస , రాజు పాల్గొన్నారు.