Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: ఇన్ టైంలో అనుమతులు ఇవ్వండి, జాప్యం చేయవద్దు

Karimnagar: ఇన్ టైంలో అనుమతులు ఇవ్వండి, జాప్యం చేయవద్దు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు ప్రచారానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వాటికి ఇన్ టైంలో అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మొదటి విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సువిధ కింద ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకునేందుకు అనుమతి కోసం రాజకీయ పార్టీల నాయకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. తర్వాత వాటికి సంబంధించిన అనుమతులు వెంట వెంటనే ఇన్ టైంలో ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడ జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

- Advertisement -

సువిధ కింద రాని వాటికి సంబంధించిన అనుమతులపై సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ ను అధికారులు అందరూ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అందరూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన పై వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, సీపీఓ కొమురయ్య, డీపీఓ రవీందర్, డీఐఓ శివరాములు, ఎస్వో దత్తారెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News