Friday, April 4, 2025
HomeతెలంగాణKarimngar: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ డే హవా

Karimngar: జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్ డే హవా

నిర్లక్ష్యంగా జవాబు చెబుతూ..

అనునిత్యం కరీంనగర్ జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో జరిగిన తప్పిదాలపై కరీంనగర్ జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో సమస్యల గురించి తెలుసుకోవడానికి వచ్చే ఫిర్యాదుదారులకు కరీంనగర్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే అటెండర్ ది హవాగా నడుస్తుంది. కార్యాలయానికి వచ్చిన వారికి నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ ఫోనే జీవితముగా చూస్తూ జామకాయలు తింటూ ఆమె పని ఆమె చేస్తూ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ వ్యవహరిస్తున్న ఆమెపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం . సార్ ను కలవాలన్న అటెండర్ దే హవాగా నడుస్తుంది. ఆఫీసుకు వచ్చే ఫిర్యాదుదారులు అధికారులను కలువనీయకుండా ప్రవర్తించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకనుండి అయినా జిల్లా అధికారులను కలిసే అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News