Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: బిఆర్ఎస్ అంటే బందిపోటు రాష్ట్ర సమితి

Karimnagar: బిఆర్ఎస్ అంటే బందిపోటు రాష్ట్ర సమితి

కేటీఆర్ ఏనాడైనా ఉద్యమంలో కనపడ్డారా?

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జిల్లా/ మండల/బ్లాక్/ పట్టణ/నగర అధ్యక్షులతో మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రసత్య ప్రసన్న రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (ఇందిరాభవన్) లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో పార్టీ అధిష్టానం ఎవరికీ టిక్కెట్ ఇచ్చిన అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, దీనికోసం గ్రామస్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలన్నారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తదని మహిళలందరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఇక్కడ నేను ఆశించిన స్థాయిలో మహిళా కాంగ్రెస్ పని చేయడం లేదనిపిస్తుందని కార్యవర్గ సభ్యులు ఇంకోసారి ఏదో సాకులు చెప్పి సమావేశాలకు డుమ్మా కొడితే ఊరుకునేది లేదన్నారు. వారం రోజులు టైం ఇస్తున్నానని, జిల్లా/ మండల/ పట్టణ/ నగర కమిటీలను త్వరత గతిన పూర్తి చేసి పార్టీని బూతు స్థాయిలో బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో మినిమం 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా మహిళ కాంగ్రెస్ పనిచేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పెద్దపీట వేస్తామన్నారు. పైరవీలు నా దగ్గర నడవవు, నోట్ల రద్దు చేసి నల్లధనం బయటకు తీసుకొస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని వేసిండా? చివరికి పసిపిల్లలు త్రాగే పాలపై కూడా జీఎస్టీ వేయడం ఎంతవరకు సబబు అని, బీసీలకు జరిగిన అన్యాయం విషయంలో ఎప్పుడు మాట్లాడని లిక్కర్ రాని కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని మాట్లాడుతుందన్నారు, 10 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు అప్పుడు మీ అయ్య కేసిఆర్ ను ఎందుకు అడగలే, కవిత, కేటీఆర్ ఏనాడైనా ఉద్యమంలో కనబడ్డారా? లిక్కర్ దందాలో ఆధారాలతో సహా పట్టుబడ్డ కవితను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదని బిజెపి, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని , కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే, బిఆర్ఎస్ పార్టీ వారికి ఎందుకు ఇంత కడుపు మంటఅని , కొంతమంది ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి పార్టీపై వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారన్నారు. బిజెపి, బిఆర్ఎస్ వారు ఇన్ని రోజులు దోచుకున్న డబ్బులను రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బయటకు తీస్తారని , డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండన్నారు. ఈరోజు నుండే పార్లమెంటు స్థాయిలో మహిళా కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభారాణి, రాష్ట్ర కోఆర్డినేటర్ పద్మ, నాయకు రాళ్లు ముద్దం లక్ష్మి, చంద్రకళ, తాటిపర్తి విజయలక్ష్మి, సరళ, నీలం పద్మ, లతోపాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జిల్లా/ మండల/ బ్లాక్/ పట్టణ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News