Tuesday, September 17, 2024
HomeతెలంగాణKarimnagar: పోలీసుల కస్టడీలో తోట శ్రీపతిరావు

Karimnagar: పోలీసుల కస్టడీలో తోట శ్రీపతిరావు

కీలక డాకుమెంట్లు లభ్యం

కరీంనగర్ లోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమండ్ల రవీందర్ తీగలగుట్టపల్లి లోని రోడ్ నెంబర్ 16, కార్తికేయనగర్ లో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్లను కూల్చి అక్రమంగా భూకబ్జాకు పాల్పడ్డ నిందితుడు ఆర్టీఏ మెంబర్ తోట శ్రీపతిరావును ఈ నెల 06 వ తేదీ మంగళవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా గౌరవ కోర్టు నిందితుడిని 14 రోజుల రిమాండ్ విధించి, జైలుకు తరలించిన విషయం విధితమే. ఇదిలా ఉండగా జైలులో ఉన్న శ్రీపతిరావును, పై కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం సేకరించేందుకు కోర్టు ద్వారా, అనుమతి మేరకు ఈరోజు సోమవారం ఉదయం 10.30 గంటల నుండి రేపు మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటల వరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పోలీస్ కస్టడీకీ తీసుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా పోలీస్ కస్టడీలోకి తీసుకున్న శ్రీపతిరావు కరీంనగర్ లోని ఇంట్లో సోదాలు జరిపినట్లు తెలిసింది. ఈ సోదాల్లో నమోదైన కేసుకు సంబంధించిన పలు కీలక డాకుమెంట్లను లభించాయని వాటిని కరీంనగర్ రూరల్ పోలీసులు స్వాధీన పరుచుకున్నారని సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News