Thursday, October 3, 2024
HomeతెలంగాణKarimnagar: మంత్రికి బీఆర్ఎస్ సారీ చెప్పాల్సిందే

Karimnagar: మంత్రికి బీఆర్ఎస్ సారీ చెప్పాల్సిందే

మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకు..

సోషల్ మీడియాలో రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ పై అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ విధానాలను ఖండిస్తూ గురువారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పిలుపుమేరకు నగరంలోని ఇందిరా చౌక్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి మాట్లాడుతూ.. మహిళా మంత్రి కొండా సురేఖ ని కించపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్న వారిని ప్రోత్సహించిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేశారు.

వారి కుటుంబంలో కూడా అక్క చెల్లెల్లు ఉంటారని టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న హయాంలో ఒక్క మహిళకు కూడా క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం, కనీసం స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు కూడా ఒక మహిళను నియమించకపోవడం సిగ్గు చేటన్నారు.

ఇంత జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడం ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా సభ్యులను హెచ్చరించకపోవడం వెనుక వారి ప్రమేయం ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సమచిత స్థానాన్ని కల్పిస్తూ మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సును ఏర్పాటు చేయడం పట్ల మాలాంటి ఎంతో మంది మహిళలు గౌరవంగా బస్సు ప్రయాణం చేయడం , కొంతమంది రోజువారి కూలీ పనులకు వెళ్లే మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించడం జరిగింది కానీ దానిని కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఆర్టీసీ బస్సులో రికార్డు డ్యాన్సులు చేసుకోమని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నారు.

బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ఈ దుష్ప్రచారాలు పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా మంత్రి కొండా సురేఖ కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుశీల, భారతమ్మ , జిల్లా కార్యవర్గం కవిత, లావణ్య, రజిత రెడ్డి ,హసీనా, సత్య, అంజలి, స్వప్న, హుజూరాబాద్ టౌన్ అధ్యక్షులు పుష్పలత,మండల అధ్యక్షులు, లత, సుజాత, మంజుల, లావణ్య, స్వప్న, లత, కవిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News