కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి సి.హెచ్.వి.ఎస్. జనార్దన్ రావుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఏడవ తరగతి, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బి.ఎడ్, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను, “సర్వీస్ బుక్కు” (సేవా పుస్తకం) లో నమోదు కాపాడిన పుట్టిన తేదీ డీఈవో కార్యాలయానికి వివిధ రూపంలో మంజూరు కాపాడిన నిధులు, తీర్మానాలు, యూసిల వివరాలు, డీఈవో ఉపయోగించే ప్రభుత్వ వాహనం నెంబరు పెట్రోల్/ డీజిల్ బిల్లు రసీదులు, వివిధ పాఠశాలల “తనిఖీ- పర్యవేక్షణ” కు సంబంధించిన “టూర్ డైరీ”, ఇన్ కమ్ టాక్స్ చెల్లింపులు తదితరుల వివరాలపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు సమాచార హక్కు చట్టం -2005 ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాం. రాజయ్య తెలిపారు.
కోరిన ఆర్టిఐ సమాచారం ఇవ్వాల్సిందే అంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ “పమేలా సత్పతి” డీఈవో “జనార్దన్ రావు” కు తేదీ:(20- మార్చి-2024) న “నోటీస్” కూడా జారీ చేశారు.
“డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్” అయినటువంటి కలెక్టర్ కరీంనగర్ ఆదేశాలను డీఈవో జనార్దన్ రావు బేఖాతరు చేస్తున్నారని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంరాజయ్య ఆరోపించారు. ఆర్.టి.ఐ చట్టానికి తూట్లు పొడిచే విధంగా డీఈవో వ్యవహరిస్తున్నారని రాంరాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ “నిర్లక్ష్య వైఖరి” కనబరుస్తున్నారని తెలిపారు. తక్షణమే కోరిన ఆర్.టి.ఐ. సమాచారం ఇప్పించాలని మరో మారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ “పమేలా సత్పతి” కి మరొమారు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.