Friday, April 4, 2025
HomeతెలంగాణKarimnagar: పోలీస్ కమిషనరేట్ లో దసరా వేడుకలు

Karimnagar: పోలీస్ కమిషనరేట్ లో దసరా వేడుకలు

ఆయుధ , వాహన పూజల్లో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బరాయుడు

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో దసరా పర్వదినం సందర్బంగా నిర్వహించిన వాహన, ఆయుధ పూజా కార్యక్రమాల్లో పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పోలీసు కమిషనర్ సుబ్బరాయుడు ఆకాంక్షించారు. ప్రజల సహకారం అనేది మనకు గొప్ప ఆయుధం అని విజయం చేకూర్చే విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రానున్న ఎన్నికలలో రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పోలీసుల గౌరవం, కీర్తిప్రతిష్టలు పెంపొందించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(ఎల్&ఓ) లక్ష్మినారాయణ , అడిషనల్ డీసీపీ పరిపాలన రాజు, ఏ.సి.పి (ఏఆర్ ) సి. ప్రతాప్ ,సి సి ఆర్ బి ఏ సిపి విజయ్ కుమార్ , ఆర్ ఐ లు సురేశ్, శ్రీధర్, శేఖర్ బాబు, సిఐలు సృజన్ రెడ్డి, ఆర్ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News