Sunday, July 7, 2024
HomeతెలంగాణKarimnagar: CP ఆఫీస్ లో రాష్ట్రావతరణ వేడుకలు

Karimnagar: CP ఆఫీస్ లో రాష్ట్రావతరణ వేడుకలు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిషనరేట్ కేంద్రంలో గల క్వార్టర్స్ గార్డ్ వద్ద పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పోలీస్ శాఖ చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. అభివృద్ధి పనుల కోసం ఎలాంటి ఆటంకాలు జరగకుండా కమిషనరేట్ పోలీసులు పట్టిష్టమైన చర్యలతో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు ఫలితంగా ప్రజల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను అన్ని వర్గాల ప్రజలకు వివరించనున్నామని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో రాష్ట్ర దశాబ్ది కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి విభాగం పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సహకారంతో శాంతి పద్ధతి పరిరక్షణ చర్యల్లో ముందుకు సాగుతామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమంలో అన్ని స్థాయికి చెందిన అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పోలీసులకు తమ వంతు సహకారం అందిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు

- Advertisement -

కమిషనరేట్ పోలీస్ కార్యాలయం (సిపిఓ) లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ డిసిపి జి చంద్రమోహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ పతాకాలు ఎగురవేసిన అనంతరం పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు అధికారులు, సిబ్బందికి సీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతి భద్రతలు) జి చంద్రమోహన్ (పరిపాలన) ఎం భీం రావు (సిఏఆర్) ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ బాబా సాహెబ్ ఎసిపి లు మదన్ లాల్, సి ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) ముని రామయ్య, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు బి సంతోష్ కుమార్, వెంకట నర్సయ్య, తిరుమల్, ఆర్ఐ లు మురళి, మల్లేశం, సురేష్, శేఖర్ బాబు, లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన సూపరిండెంట్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

లఘు చిత్రం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పురస్కరించుకొని కమీషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన లఘు చిత్రాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీస్ శాఖ ముందుకు సాగుతున్న తీరును ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఆయుధాలు, డాగ్ స్క్వాడ్, బిడి టీం ల పరికరాల ప్రదర్శన

విధి నిర్వహణ సందర్భంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, డాగ్ స్క్వాడ్ విధులు, బాబు డిస్పోజబుల్ స్వాడ్ పరికరాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ పోలీసుల విధి నిర్వహణ తీరును అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News