Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఐజి

Karimnagar: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఐజి

కరీంనగర్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజి కె రమేష్ నాయుడు తనఖీ చేశారు. ట్రాఫిక్ ఏసిపి విజయ్ కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. తర్వాత పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో డిఐజితో పాటుగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ తనిఖీ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో డిఐజి కె రమేష్ నాయుడు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించాలన్నారు. ఎక్కువగా ప్రజలకు కనిపించే విధంగా ఉండే ట్రాఫిక్ పోలీసులను 99శాతం ప్రజలు గమనిస్తుంటారని, విధుల్లో క్రమశిక్షణతో మెదులుతూ చురుకుగా ఉండాలని చెప్పారు. శాస్త్రీయ బద్దమైన రీతిలో విధులను నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు వివిధ రకాల శిక్షణలు పొందేందుకు ఆసక్తి చూపాలని తెలిపారు. శిక్షణల ద్వారా వృత్తి నైపుణ్యం మరింత మెరుగవుతుందని సూచించారు. కరీంనగర్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలోకి రావడం ద్వారా 50శాతం శారీరక శ్రమ తగ్గుతుందని చెప్పారు. వాహనదారుల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ లను కొనసాగించాలని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే సంబంధిత శాఖలకు చెందిన అధికారుల సహకారం తీసుకోవాలని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు, ఏసిపి విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జున రావు లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News