Monday, November 25, 2024
HomeతెలంగాణKarimnagar: అత్మలకే ఇంటి నెంబర్లా? డబ్బులిస్తే ఎంతటి పనికైనా సిద్దం!

Karimnagar: అత్మలకే ఇంటి నెంబర్లా? డబ్బులిస్తే ఎంతటి పనికైనా సిద్దం!

మున్సిపల్ కార్పొరేషన్ వింత బాగోతం

బ్రతికి ఉండి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఇంటి పర్మిషన్కు , కరెంటు మీటర్ కు, ఇంటి నెంబర్ కు సాధారణమైన వ్యక్తి చెప్పులు అరిగేలా తిరిగినా గాని ఇది లేదు అది లేదు అని ..తిరిగి తిరిగి పని గాని పరిస్థితిలు ఎన్నో వుతున్నాయి. ఇక్కడో వింత గ్రామం ఆత్మలకే ఇంటి నెంబర్లు, బ్రతికున్న మనిషికే అనుకూలంగా పనిచేయని అధికారులు చనిపోయిన వారిపై ఇంటి నెంబర్లు కేటాయించడం ఒక వింత. వివరాల్లోకి వెళితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ రేకుర్తిలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55 కు ఆనుకొని ఉన్న భూమిని కబ్జా చేయడానికి చనిపోయిన వారికి ఇంటి నెంబర్లు కేటాయించారు. హస్తపురం మహంకాళి 2012 లో చనిపోయారు.

- Advertisement -

రేకుర్తి గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ లో 14/03/2019 లో విలీనం అయింది. అతనికి మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు ఇంటి నెంబర్ 3-69/5/4/5/A/1 కేటాయించారు. ఇవే కాకుండా 3-69/5/4/6/A/1, 3-69/5/4/4/A/1, 3-69/5/4/2/A/1 ఈ నెంబర్లు కూడా చనిపోయిన వారికి కేటాయించినవే. అతను ఎనిమిది సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటే ఇంటి నెంబర్ కేటాయించడం ఒక వింతగా ఉంది .

ఇవే కాకుండా రేకుర్తి గ్రామంలో చనిపోయిన వారికి చాలా ఇంటి నెంబర్లు కేటాయించారని గ్రామస్తులు అనుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కోసం చనిపోయిన వారికి బ్రతికున్న వారికి ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. దీనిపైన జిల్లా కలెక్టర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ , మున్సిపల్ కమిషనర్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News