Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: పదవుల కోసం కాదు భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్నా

Karimnagar: పదవుల కోసం కాదు భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్నా

కరీంనగర్ గ్రామీణ మండలం బోమ్మకల్ శివారులో ఇండియన్ మెడికల్ అసోసియెషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ విశిష్ట అతిధిగా పాల్గొని జిల్లా కలెక్టర్, మేయర్, ఐఎంఎ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన తాను , తన చిన్నతనంలో పెద్దపెద్ద వృక్షాలు, పచ్చని ఆహ్లదకరమైన మొక్కలతో వాతావరణ సమతౌల్యత ఎర్పడి కాలం వారిగా వాతవరణంలో మార్పులు చోటుచేసుకునేవని, మారుతున్న పరిస్థీతుల ద్యశ్యా మొక్కలను తొలగించడంతో ఎండకాలంలో విపరీతంగా వానలుకురవడం, చలికాలంలో చలి తగ్గిపోడం వంటి మార్పులు జరుగుతున్నాయన్నారు. వృక్షో రక్షతి రక్షితః అన్న చందంగా మనం మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తే అవి మనల్ని, మన భవిష్యత్తు తరాలను కాపాడుతాయని అన్నారు. చారిత్రక నగరంగా నిలిచిన కరీంనగర్ అభివృద్దిలో చోటు చేసుకుంటున్న మార్పులను గురించి తెలంగాణ రావడానికి మునుపు, వచ్చిన తరువాత అని బేరీజు వేసుకుంటే ఊహించని స్థాయిలో నగరం అభివృద్దిని సాదించింన్నారు. ఒక్కప్పుడు ఈ మార్గంగుండా వెళ్లాలంటే బయపడే స్థితి ఉండేదని, నగరం అభివృద్దిని నామమాత్రంగా కాకుండా జిల్లాకేంద్రంలోని ఏమూలన చూసిన మట్టి అంటని అద్బుతమెన, విశాలమెన రొడ్లు, డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఘనంగా బ్రహోత్సవాలు, కళోత్సవాలు వంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జల్లాల కన్న అద్బుతంగా, హైదరాబాద్ తరువాత ఆస్థాయిలో కరీంనగర్ అభివృద్ది చెందిందన్నారు.

- Advertisement -

గతంలో ఆసుపత్రులలో వైద్యం చేయింకునే రోగి ఏదైనా కారణాలతో చనిపోతే ఆ రోగి బంధువులతో పాటు సంబంధం లేని మరికొంత మంది కలిసి ఆసుపత్రులపై దాడులకు తెగబడి బెదిరించే పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ప్రస్తుతం పటిష్టమైన లా ఆండ్ ఆర్డర్ అమలు చేయడంతో పూర్తగా అవన్ని పోయాయని అన్నారు. కలలో కూడా ఎవరు ఉహించని విధంగా నేటి తరంతో పాటు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మానేరు పై తీగలవంతేన, మానేరురివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించుకున్నామన్నారు. దక్షిణ భారతదేశంలో మానేరు రివర్ ఫ్రంట్ వంటి మహోన్నత నిర్మాణానికి మొదటగా అనుమతిని పొందినప్పటికి, దుర్గం చెరువును మొదటగా ప్రారంబించాం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచంలోనే మూడవ వాటర్ ఫౌంటెన్ ను మానేరు రివిర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేయనున్నామని, పనులు చివరిదశలో ఉన్నాయని, త్వరలో ప్రారంబించుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు. తాను ఎప్పుడు భవిష్యత్తు తరాల అభివృద్ది కొరకు మాత్రమే అలోచిస్తు పనిచేస్తానని, రాజకీయ అభివృద్ది కొరకు కాదని, మంచి ఉద్దేశ్యంతో చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి మేముసైతం సహకారాన్ని అందిస్తానని మంత్రి హమి ఇచ్చారు. మేయర్ వై. సునీల్ రావు మాట్లాడుతూ, మున్సిపాలిటీలలో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చని పర్యావరణ ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో బాద్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారని, ఆ దిశగా హరితహారంలో ప్రతిసారి మున్సిపల్ నిధులలో 10శాతం గ్రిన్ బడ్జెట్ క్రింద మొక్కల కొరకు ఖర్చు చేయాలని చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. హరితహారంలో భాగంగా 48 ఎకరాలలో మియావాకి ప్లానిటేషన్ ను 11 ప్రదేశాలలో చేపట్టామని, ప్రతి ఇంటికి ఆరుమొక్కలు ఇచ్చేలా 11 నర్సరీలలో 6లక్షల మొక్కలను అందుబాటులో ఉంచుకోవడం జరిగిందన్నారు. పట్టణాలలో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా 11 చోట్ల వాకింగ్ ట్రాక్ లు, 60 ఒపెన్ జిమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, డాక్టర్ వృత్తి ఎంతో బాద్యతతో కూడినదని, రోగి ఆరోగ్య స్థితిని బట్టి త్వరగా వ్యాధిని నయం చేయడంలో డాక్టర్లు ఎవిధంగా కృషి చేస్తారో అదే విధంగా జిల్లా పరిపాలన కూడా ఉంటుందని అన్నారు. జిల్లాలో ఐఎంఏ అద్వర్యంలో చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరపున సహకారం అందిస్తానని, జిల్లాను ఆరోగ్యవంతమైన జిల్లాగా తీర్చేదిద్దడం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రితో సాధ్యపడదని, ఆ దిశగా ప్రైవేటు ఆసుపత్రులు కూడా కృషిచేయాలని, సమిష్టి సహాకారంతో జిల్లాలొ సంపూర్ణ ఆరోగ్యవంతమై జిల్లా తీర్చిదిద్దగలమని అన్నారు. జిల్లాలో సిపిఆర్ విదానం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలొ రాష్ట్రంలోనే జిల్లా వైద్యులు ముందున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బి.ఎన్. రావు, బోమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్, యంపిపి లక్ష్మయ్య,యంపిటిసి లక్ష్మీ, జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ రామ్ కిరణ్, డాక్టర్ కిషన్, జగన్మోహన్, బంగారు స్వామి, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News