Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: కాంగ్రెస్ పార్టీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్

Karimnagar: కాంగ్రెస్ పార్టీ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్

హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని పద్దెనిమిది నుండి ముప్పై అయిదు సంవత్సరాల యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాల వారీగా యువశక్తిని మేల్కొలిపే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడమైనదని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో 7661899899 నెంబర్ కు మిస్డ్ కాల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఉచితంగానే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆన్ లైన్ పరీక్షలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి గా ల్యాప్ ట్యాప్, రెండవ బహుమతిగా స్మార్ట్ ఫోన్, మూడవ బహుమతి గా ట్యాబ్ లెట్, ప్రోత్సాహ బహుమతులుగా స్మార్ట్ వాచీలు,ఇయర్ ప్యాడ్ లు, పవర్ బ్యాంక్ లు ఇవ్వబడుతా యని నరేందర్ రెడ్డి అన్నారు.వీటితో పాటు ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోని మహిళా టాపర్ లకు ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా అందజేయబడుతుందన్నారు.ఈ అవకాశాన్ని కరీంనగర్ నియోజక వర్గం లోని యువతి యువకులు ముఖ్యంగా విద్యార్థులు వినియోగించుకొని అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిభతో పాటు విలువైన బహుమతులు గెలుచుకోగలరని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో కుర్ర పోచయ్య,కొరివి అరుణ్ కుమార్,ఎం డి చాంద్,జీడీ రమేష్,షబానా మహమ్మద్, షేహెన్ష,అష్రఫ్ ఖురేషి,హనీఫ్, కమల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News