పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా రిసెప్షన్ అధికారులు సేవలందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. ఫిర్యాదుదారులకు కనీస మర్యాదనిచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టి సమస్యలను ఓపికగా విని.. సత్వరం పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సుబ్బరాయుడు ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్ కేంద్రాలలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఏరోజుకు సంబంధించిన వివరాలను ఆరోజు అప్లోడ్ చేయాలని చెప్పారు. టెక్నాలజీ వినియోగాన్ని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. సమర్థవంతమైన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందని, ప్రతి పోలీసు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేందుకు క్రమశిక్షణతో మెదులుతూ కృషి చేయాలని కమిషనర్ కోరారు.