Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Karimnagar: ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. సంతృప్తికరమైన సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

కమీషనరేట్ కేంద్రంలో నేరసమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఛార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో వెంటనే సిసి నెంబర్లను తీసుకోవాలన్నారు. నిందితులు పరారీలో ఉండటం వల్లనే పెండింగ్ కేసులు పరిష్కారం కాలేకపోతున్నాయని తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు వారెంట్లను వేగవంతంగా అమలు చేయాలని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతినెలా కేసుల పరిష్కారం సంఖ్యను పొంపాందించాలని తెలిపారు. సాంకేతక కారణాలతో పనిచేయని సిసి కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పారు. కొన్నిప్రాంతాల్లో సిసి కెమెరాలు పనిచేయకపోవడం వల్ల కేసుల ఛేదనలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. నేరాల నియంత్రణ, ఛేదనలో సిసి కెమెరాల పాత్రను గుర్తించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలోని వివిధ విభాగాల పనితీరును ప్రతిరోజు సమీక్షించాలని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. లోక్ అదాలత్ లో రాజీపద్దతి ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీసు అధికారులు గ్రామ సందర్శనలు చేస్తూ సమస్యలను తెలుసుకోవడంతోపాటు అల్లర్లు సృష్టించే వారి కదలికలపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల్లో ప్రజల రక్షణ, భద్రతల కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు) జి చంద్రమోహన్ (పరిపాలన), యం భీంరావు(సిఏఆర్), ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయ్ కుమార్, సి ప్రతాప్, మదన్ లాల్, వెంకటరెడ్డి, సత్యనారాయణ, కాశయ్య, శ్రీనివాస్, ఎస్ బిఐ-2 సంతోష్ కుమార్ లతోపాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News