ధనార్జనే ధ్యేయంగా రోగుల జీవితాలతో చెలగాటమడుతున్న రేనే ఆసుపత్రిని సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోనగిరి మహేందర్, బ్రాహ్మణపల్లి యుగంధర్ అన్నారు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడు మృతి చెందడానికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఈ నెల 19 న రామడుగు మండల కేంద్రానికి చెందిన చేత్రిక్ ను జిల్లా కేంద్రంలోని రేనే ఆసుపత్రికి తీసుక రాగానే డాక్టర్స్ మీ కొడుకుకు గుండె లోపల హోల్ ఉందని, వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్ సూచించగా, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయని అడగగా 1,70,000 ప్యాకేజీకి చేస్తామని డాక్టర్స్ చెప్పగా, వెంటనే లక్ష రూపాయలు కట్టగా నిన్న ఉదయము డాక్టర్స్ సర్జరీ చేస్తుండగా ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందకపోవడం వల్ల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అబ్బాయి చనిపోయాడని ఆరోపించారు.
దీంతో ఆగ్రహించిన బాలుడి తరపువారు ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రిని వెంటనే సీజ్ చేసి, యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేని ఎడల అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.