Wednesday, June 25, 2025
HomeతెలంగాణKarimnagar: మార్చి నుంచి రేవంత్ పాదయాత్ర

Karimnagar: మార్చి నుంచి రేవంత్ పాదయాత్ర

హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా యాత్ర – మార్పు కోసం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్ర మార్చి మొదటి వారంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. మొదట హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర దశలవారీగా పార్లమెంటు నియోజకవర్గంలోని మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొనసాగనుంది.
ఇందుకు సంబంధించి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్చార్జిలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకుల బృందంతో వరంగల్ లో రేవంత్ ప్రత్యేకంగా సమావేశమై పాదయాత్ర గురించి చర్చించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను కరీంనగర్ పార్లమెంటులోని నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తల సమన్వయంతో ఘనంగా నిర్వహిస్తామని, నియోజకవర్గ స్థాయి ప్రజల ఆశీర్వాదంతో పాదయాత్రను విజయవంతం చేస్తామని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News