Saturday, April 5, 2025
HomeతెలంగాణKarimnagar: తెలుగుప్రభ కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు, విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ సస్పెండ్

Karimnagar: తెలుగుప్రభ కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు, విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ సస్పెండ్

మద్యం మత్తులో విధులకు హాజరైన గుండి సబ్ స్టేషన్ ఆపరేటర్ వినయ్

మద్యం మత్తులో విధులకు హాజరైన రామడుగు మండలం గుండి సబ్ స్టేషన్ ఆపరేటర్ వినయ్ ను డిఇ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే… రామడుగు మండలం గుండి సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వినయ్ ఆదివారం మద్యం మత్తులో విధులకు హాజరు కావడంపై సోమవారం”” తెలుగు”” ప్రభ దినపత్రికలో మద్యం మత్తులో విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ అనే కథనంతో శీర్షిక ప్రచురిచితమైంది. తెలుగు ప్రభ కథనానికి స్పందించిన డి ఈ తిరుపతి మంగళవారం వినయ్ ని సస్పెండ్ చేశారని ఏ. ఈ. శంకరయ్య తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే విద్యుత్ శాఖ సిబ్బందికి ఇది ఒక హెచ్చరిక లాగా ఉంటుందని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను వెలుగులోకి తీసుకొచ్చిన తెలుగు ప్రభ దినపత్రిక ప్రతినిధిని పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News