Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: ప్రజలకు పోలీసుల సేవలు

Karimnagar: ప్రజలకు పోలీసుల సేవలు

చట్టానికి అనుగుణంగా పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని ముల్టీజోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజలతో మమేకమై చట్టాల అనుసరించి చట్టాలకు అనుగుణంగా పోలీసులు ప్రజలకు సేవలు అందించాలన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రాన్ని మల్టీ జోన్-1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ఎస్. చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత గౌరవవందనం స్వీకరించారు.. అనంతరం పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడుతో పాటుగా కమిషనరేట్ లోని పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కమీషనరేట్ లోని అధికారులతో సమావేశమై శాంతిభద్రతల విషయం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ కార్యకలాపాల నియంత్రణకోసం చేపట్టే చర్యలు అక్రమమార్కులకు వణుకుపుట్టించే విధంగా ఉండాలన్నారు. అక్రమ కార్యకలాపాలకు ప్రత్యక్ష్యంగా, పరోక్షకంగా సహకరించే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకోవాలని వారిపై నిఘా ఉంచాలని చెప్పారు. అక్రమ, అసాంఘిక కార్యకలాపాలతో నేరప్రవృత్తి పెంపొంది, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటాయని తెలిపారు. విజబుల్ పోలీసింగ్ నకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. రద్దీగా ఉండే సమయాల్లో ముఖ్య కూడళ్ళ వద్ద విజబుల్ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండే అన్నిస్థాయిలకు చెందిన పోలీసులను విధులకు వినియోగించాలని తెలిపారు. వివిధ రకాల కేసుల విచారణల సందర్భంగా సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి ప్రత్యక్ష్యంగా వెళ్ళి దర్యాప్తు చేయాలన్నారు. సంఘటన స్థలానికి ప్రత్యక్ష్యంగా వెళ్ళకపోయినట్లయితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. నేరాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా గస్తీ నిర్వహించడంతోపాటు ఆ ప్రాంతంలోని పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రతి కదలికపై వేగంగా సమాచారం లభిస్తుందని తెలిపారు. దాని కొరకు సాంకేతికను కూడా ఉపయోగించుకోవాలని అన్నారు మరియు మహిళల రక్షణ, భద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలన్నారు. మహిళల రక్షణ, భద్రతలకోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించే తెలియజేయాలని చెప్పారు. నేరుగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా హాక్స్ఐ, వాట్సాప్, ఫేస్ బుక్, డయల్ 100, ఇతర ప్రత్యేక హెల్ప్ లైన్ల ద్వారా ఫిర్యాలు చేసేందుకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పేలుడు పదార్థాలు నిల్వఉంచే ప్రదేశాల్లో తీసుకుంటున్న రక్షణ చర్యలను తరచూ తనిఖీ చేయాలని చెప్పారు. నిబంధనలను విస్మరించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ, ఛేదన కోసం దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటులో అన్నివర్గాలకు చెందిన ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. సిసి కెమెరాల పుటేజీల ద్వారా ఛేదించబడిన కేసుల గురించి కమ్యూనిటి మీటింగ్ లు నిర్వహించిన సందర్భాలలో వివరించాలని సూచించారు. అన్నిస్థాయిలకు చెందిన పోలీసులు క్రమశిక్షణతో మెదులుతూ విధులను నిర్వర్తించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసులపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లు, సిబ్బంది నివసించే క్వార్టర్లలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధన్యతనివ్వాలని చెప్పారు. 5ఎస్ ప్రోగ్రాం అమలును అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఆర్ధిక నేరాల నియంత్రణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు. లైసెన్సులు లేకుండా ఆయుధాలు వినియోగించబడుతున్న విషయాన్ని తీవ్రంగా
పరిగణించాలన్నారు. అక్రమంగా ఆయుధాలను వినియోగించే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్(శాంతిభద్రతలు), జి చంద్రమోహన్(పరిపాలన), యం భీంరావు(సిఎఆర్), ఎసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, శ్రీనివాస్, వెంకటరెడ్డి, బి. విజయ్ కుమార్, మదన్ లాల్, కాశయ్య, సత్యనారాయణ, సి.ప్రతాప్ లతోపాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

పోలీసులకు ద్విచక్ర వాహనాలు అందజేత

కమీషనరేట్ లోని పోలీస్ స్టేషన్లు, వివిధ విభాగాలకు కేటాయించిన ద్విచక్ర వాహనాలను మంగళవారం-
నాడు మల్టీజోన్ -1 ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించారు.

గస్తీ నిర్వహణతోపాటు శాంతిభద్రతలకు సంబంధించిన వివిధ రకాల విధినిర్వహణ కోసం ఈ వాహనాలను వినియోగించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఐజి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల విధుల నిర్వహణకోసం అందజేసిన వాహనాలను చాలా జాగ్రత్త వినియోగించాలన్నారు. సదరు వాహనాలను తమసొంత వాహనాలనుగా భావించి వినియోగించాలని చెప్పారు. ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే సత్వరం సదరు ప్రాంతానికి చేరుకుని ప్రాథమిక సమాచారం సేకరించి, సేవలందించాలని సూచించారు. సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని తెలిపారు. ప్రజలకు సేవలందించేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు, అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి చంద్రమోహన్(పరిపాలన), యం భీంరావు (సిఎఆర్)లతోపాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News