Sunday, September 8, 2024
HomeతెలంగాణKarimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్సైల బదిలీ

Karimnagar: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్సైల బదిలీ

కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారంనాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేసారు.

- Advertisement -

ఈ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్.శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు,
కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న జి.అనూషను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సైగా పనిచేస్తున్న ఉపేంద్రాచారిని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి , కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న యూనస్ అహ్మద్ అలీ ని హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు , కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న టి.వివేక్ ను జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు , కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పి. అభిలాష్ ను కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్. రాజేష్ ను వి.ఆర్. కరీంనగర్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న ఎన్. శ్రీనివాస్ ను కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ కు , హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న జి. సాంబయ్య ను సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు , కరీంనగర్ వి.ఆర్. లో వున్న ఎస్. హనుమంతరావును పోలీస్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News