కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావు పల్లి, రాంచంద్రాపూర్, దత్తోజి పల్లి చొప్పదండి మండల మంగళ పల్లి గ్రామాలలో కురిసిన వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, ఇతర పంటలు వేసుకున్న రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు అధైర్య పడవద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని, అధికారులు పంట నష్ట నివేదిక తొందరగా అందజేయాలని ఆదేశించారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతన్న నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తుకెళ్లినట్టయిందని ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన నష్టం హృదయవిదారకంగా ఉందని, నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.