Tuesday, September 17, 2024
HomeతెలంగాణKasani: కాసానిని కలిసిన టీడీపీ కరీంనగర్ బృందం

Kasani: కాసానిని కలిసిన టీడీపీ కరీంనగర్ బృందం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో అధికార ప్రతినిధిగా నూతనంగా నియామకమైన దామెర సత్యం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ నియామకం చేసినందుకు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికార ప్రతినిధిగా సక్రమంగా విధులు నిర్వహిస్తూ అధికార పార్టీ తప్పులను ప్రజలకు తెలిసే విధంగా నా బాధ్యతను నిర్వహిస్తానని సత్యం హామీ ఇచ్చారు. పార్టీని బలోపేతం చేస్తూ పూర్వ వైభవం తేవడానికి కృషి చేయాలని దామెరను ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశించారు.

- Advertisement -

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ వంచ శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆవునూరి దయాకర్ రావు, పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు గంగాధర కనకయ్య, నాగుల బాల గౌడ్, కంకటి రాజశేఖర్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News