Friday, September 20, 2024
HomeతెలంగాణKaushik Reddy: మహిళ ఆరోగ్యం..ఇంటికి సౌభాగ్యం

Kaushik Reddy: మహిళ ఆరోగ్యం..ఇంటికి సౌభాగ్యం

మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది

మహిళ ఆరోగ్యమే ఆ ఇంటికి సౌభాగ్యమని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ పథకాన్ని ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ పక్షపాతి అని మహిళల సంక్షేమానికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికున్న ఆరోగ్య సమస్యల గుర్తించి అందుకు అవసరమైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఆరోగ్య మహిళ కార్యక్రమమని, దీనిని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి మహిళ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్య సిబ్బంది సైతం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబానికి మహిళ యొక్క ప్రాముఖ్యతను తన అనుభవం ద్వారా వివరించిన తీరు సమావేశానికి హాజరైన పలువురిని ఆకట్టుకుంది.

- Advertisement -

అనంతరం ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అందులో భాగంగానే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రతి మంగళవారం మహిళలందరికీ గర్భాశయం, మోనోపాజ్, క్యాన్సర్, రుతుస్రావ సమస్యలు మొదలగు స్త్రీ సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని సమస్యలు ఉన్న వారిని ప్రభుత్వ వాహనంలోనే కరీంనగర్ ఆసుపత్రికి పంపించి మందులు అందించడం జరుగుతుందన్నారు. మహిళా ప్రయోజనకరమైన ఈ అవకాశాన్ని నియోజకవర్గ పరిధిలోని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం, హెచ్ఓ చందు, సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోటపోతులు ఐలయ్య, ఎంపీటీసీ సభ్యులు దాంసాని విజయకుమార్, తెడ్ల ఓదెలు, ఎక్కేటి సంజీవరెడ్డి, సర్పంచులు జిల్లెల్ల తిరుపతిరెడ్డి, పుట్ట రాజు, కంది దిలీప్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తులసీదాస్, మనోహర్ రెడ్డి, ఒల్లాల దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News