ముదిరాజ్ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఆందోళనల వైపు పురికొల్పాయి. ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలో ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కాళికాదేవి ఆలయం నుండి, ఇందిరా చౌక్ మీదగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ముదిరాజ్ నాయకులు, యువకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో ముదిరాజుల తడాఖా ఏంటో నిరూపిస్తామన్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో, బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు లొంక నర్సింహులు, తాండూర్ నియోజకవర్గం ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్పి రవికాంత్, తాండూర్ పట్టణ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, కార్యదర్శి రాము, తాండూర్ మండల అధ్యక్షులు జగదీష్, యాలాల మండల అధ్యక్షులు హనుమంతు, బాతుల భీమ్ శంకర్, అశోక్, దోమ కృష్ణ, టిల్లు, రమేష్ బసంత్, ముదిరాజ్ యువజన సంఘం, యువకులు పాల్గొన్నారు.