Friday, November 22, 2024
HomeతెలంగాణKCR appreciates Vemula: మంత్రి వేములను అభినందించిన సీఎం కేసిఆర్

KCR appreciates Vemula: మంత్రి వేములను అభినందించిన సీఎం కేసిఆర్

స్వయంగా ఇంజనీర్ అయిన ప్రశాంత్ రెడ్డి నిద్రాహారాలు లెక్క చేయకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం పనిచేశాడని ప్రశంసించారు సీఎం కేసీఆర్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా ముఖ్యమంత్రి కేసిఆర్ సభలో మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అభినందించారు. స్వయంగా ఇంజనీర్ అయిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ విగ్రహ నిర్మాణం కోసం, తుది ఏర్పాట్ల కోసం వారం రోజులనుండైతే తీవ్రంగా శ్రమించారని, నిద్రాహారాలు సైతం లెక్క చేయకుండా పనిచేశారని ప్రశంసించారు.

- Advertisement -

ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆ శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఇతర ఆర్ అండ్ బి అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీఎం కేసిఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News