గజ్వేల్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది. గత పదిహేను రోజులుగా తమ స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ దిగ్విజయంగా కొనసాగిస్తున్న బస్సు యాత్ర తమ పట్టణం చేరుకోవటం పట్ల ఆనందంతో ఆహ్వానం పలికారు.
- Advertisement -
గజ్వేల్ చేరుకున్న తమ మహా నేతకు మంగళ హారతులతో స్వాగతం పలికి, విజయ తిలకం దిద్దిన గజ్వేల్ మహిళలు బస్సు యాత్రను నర్సాపూర్ దిశగా సాగనంపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అధినేతను చూడడానికి తరలివచ్చారు. వారందరికీ అభివాదం చేస్తూ నేతలను పలకరిస్తూ కేసీఆర్ బస్సు యాత్ర ముందుకు సాగింది.