Thursday, July 4, 2024
HomeతెలంగాణKCR falicitation to ZP Chairmans: జడ్పీ చైర్మన్ల సన్మానించిన బి ఆర్ ఎస్...

KCR falicitation to ZP Chairmans: జడ్పీ చైర్మన్ల సన్మానించిన బి ఆర్ ఎస్ అధినేత

తెలంగాణ రాష్ట్రంలోని బి ఆర్ ఎస్ జడ్పీ చైర్మన్లను బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి లోని వారి నివాసంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు . కుటుంబ సభ్యులతో సహా ఈ సమావేశానికి ఆహ్వానించడంతో జడ్పీ చైర్మన్లు వారి కుటుంబ సభ్యులు కేసీఆర్ తో కలిసి ఫోటోలు దిగారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేసీఆర్ జడ్పీ చైర్మన్లను పేరు పేరునా పలకరించారు . ఆయా జిల్లాల్లో జరిగిన అభివృద్ధిలో భాగం పంచుకుని మంచిగ పని చేసినందుకు వారిని అభినందించారు . బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో వారి యోగ క్షేమాలను చర్చిస్తూ ఎక్కువ సేపు గడిపారు . ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించారు . భోజన సమయంలో అందరితోనూ ఆత్మీయంగా సంభాషిస్తూ కనిపించారు . సమావేశం అనంతరం కేటీఆర్ జడ్పీ చైర్మన్లందరికీ యాదాద్రి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ అధినేత కేసీఆర్ గారిని కలవడం సంతోషంగా ఉందని జడ్పీ చైర్మన్లు , వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు .

జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి , బాల్క సుమన్ , గండ్ర వెంకట రమణారెడ్డి , పైళ్ల శేఖర్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య , బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు , మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

సమావేశానికి హాజరైన జడ్పీ చైర్మన్లు

జడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ ( ఆదిలాబాద్ ), కోరిపెల్లి విజయ లక్ష్మి (నిర్మల్ ), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్ ), దపేందర్ శోభ ( కామారెడ్డి ), దావా వసంత సురేష్ (జగిత్యాల ), పుట్టా మధుకర్ (పెద్దపల్లి ), కనుమళ్ల విజయ (కరీం నగర్ ), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల ), పటోళ్ల మంజుశ్రీ ( సంగారెడ్డి ), ర్యాకల హేమలత , వేలేటి రోజారాణి ( సిద్దిపేట ), శాంతాకుమారి (నాగర్ కర్నూల్ ), బండా నరేందర్ రెడ్డి (నల్గొండ ), గుజ్జ దీపిక (సూర్యాపేట ), ఎలిమినేటి సందీప్ రెడ్డి ( యాదాద్రి భువనగిరి ), ఆంగోత్ బిందు (మహబూబాబాద్ ) , గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్ ), మారపల్లి సుధీర్ కుమార్ (వరంగల్ అర్బన్ ), జక్కు శ్రీహర్షిని ( జయశంకర్ భూపాలపల్లి ) , బడే నాగజ్యోతి (ములుగు ), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం )

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News