Saturday, November 15, 2025
HomeతెలంగాణBy poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 'బి-ఫామ్' అందజేసిన కేసీఆర్

By poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ‘బి-ఫామ్’ అందజేసిన కేసీఆర్

By Elecctions of Jubileehills:తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా, అధికారికంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు అవసరమైన ‘బి-ఫామ్’ను కూడా అందజేసింది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్), జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ తరపున పోటీ చేయనున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు శుక్రవారం రోజున స్వయంగా బి-ఫామ్‌ను అందజేశారు.

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. గోపీనాథ్ మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు గోపీనాథ్ చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్, ఆయన సతీమణి సునీత గోపీనాథ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా దివంగత నేత కుటుంబానికి అండగా నిలవడంతో పాటు, నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న బలమైన కేడర్ మరియు మాగంటి కుటుంబానికి ఉన్న సానుభూతిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. బి-ఫామ్ తీసుకున్న అనంతరం మాగంటి సునీత, కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేసి, ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆమె బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావును (కేటీఆర్) కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీకి ఈ ఎన్నిక ఒక పెద్ద సవాల్‌గా పరిణమించింది. మాగంటి సునీతకు (బీఆర్‌ఎస్) బి-ఫామ్ అందజేసిన తర్వాత, పోటీని మరింత రసవత్తరం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం వి. నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం (AIMIM) అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఇక్కడ పోటీ చేసి మంచి ఓట్లను సాధించిన అనుభవం ఉంది. నవీన్ యాదవ్ బీసీ (వెనుకబడిన తరగతి) వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో, బీసీ ఓటర్ల (సుమారు 1.40 లక్షలు) మద్దతును పొందాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad