Sunday, May 18, 2025
HomeతెలంగాణKCR: రైల్ రోకో కేసు కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్

KCR: రైల్ రోకో కేసు కొట్టివేయాలని కేసీఆర్ పిటిషన్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకే రైల్ రోకో చేపట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. రైల్ రోకో జరిగిన సమయంలో అక్కడ కేసీఆర్ లేరని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఫిర్యాదుదారుడికి నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.

- Advertisement -

కాగా 2011 అక్టోబర్ 15న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సికింద్రాబాద్‌లో రైల్ రోకో చేపట్టారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగులో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News