తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మొక్కలు నాటి హరితహారం 9వ విడతను కేసీఆర్ ప్రారంభించారు. అడవులను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు అని శాస్త్రవేత్తలు ఎంత హెచ్చరించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఈసందర్భంగా కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.
అంతకుముందు సఫారీ వాహనంలో పార్కులో కలియ తిరిగిన సీఎం కేసీఆర్.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు. అనంతరం బీటీఆర్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.