Friday, November 22, 2024
HomeతెలంగాణBRS Party: కేసీఆర్ ఫస్ట్ స్టెప్.. దేశవ్యాప్తంగా కిసాన్ యాత్ర?

BRS Party: కేసీఆర్ ఫస్ట్ స్టెప్.. దేశవ్యాప్తంగా కిసాన్ యాత్ర?

- Advertisement -

BRS Party: టీఆర్ఎస్ పార్టీ రద్దు.. బీఆర్ఎస్ పార్టీ లాంచింగ్.. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం.. అంతా మంచి జరగాలని కోరుతూ పూజలు, యాగాలు.. ఇలా జెట్ స్పీడ్ తో అంతా వారం రోజులలోనే ముగించేసిన సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో ఫస్ట్ స్టెప్ ఎక్కడ నుండి మొదలు పెట్టనున్నారు? ఎలా మొదలు పెట్టనున్నారని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముందుగా కర్ణాటక రాజకీయాల నుండి ప్రత్యక్ష జాతీయ ఎన్నికల వ్యవహారంలో అడుగుపెట్టనున్నట్లు సాక్షాత్తు కేసీఆర్ చెప్పారు.

కాగా, అంతకు ముందే కొద్ది రోజులలో కేసీఆర్ ఓ యాత్రకి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ దేశం మొత్తాన్ని చుట్టేయాలని చూస్తున్నారట. ఆబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కిసాన్ యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలలో రైతుల ఓట్లే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

కేసీఆర్ తలపెట్టనున్న ఈ కిసాన్ యాత్ర మహారాష్ట్రలోని విదర్భ నుండి ఒడిశా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా మీదుగా ఇతర రాష్ట్రాలలో కొనసాగించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా గుర్నామ్ సింగ్ ను నియమించిన సంగతి తెలిసిందే. మరి కేసీఆర్ కిసాన్ యాత్ర ఎలా ఉండబోతుంది.. దానికి ప్రత్యర్థుల కౌంటర్లు ఎలా ఉండనున్నాయి? అన్నదానిపైనే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఒక అభిప్రాయం స్పష్టం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News