Saturday, November 23, 2024
HomeతెలంగాణKCR's government is Minority friendly: మైనారిటీలకు అండగా నిలిచిన కేసీఆర్ సర్కార్

KCR’s government is Minority friendly: మైనారిటీలకు అండగా నిలిచిన కేసీఆర్ సర్కార్

అర్హులైన మైనారిటీలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న కేసీఆర్

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన క్రిస్టియన్లకు ..క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా., అర్హులైన ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైన్, పార్శీ మతాలకు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా..ఈ లక్షరూపాయల ఉచిత సబ్సిడీని ప్రభుత్వం అందచేస్తుంది.

- Advertisement -

మైనారిటీల సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ మరింత సమాచారం :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి, అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణ, అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనే అమలు కావడం లేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారి విద్యా వికాసానికి, వారి సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదం చేసే అనేక పథకాలు, కార్యక్రమాలను తెచ్చి వారిని సంఘంలో ఆత్మ గౌరవం, హోదా కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే కార్యాచరణను అమలు చేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమ భావనను పాటిస్తూ, ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష, విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది.
తెలంగాణ ఏర్పడకముందున్న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి 300 కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ నుంచి 2023 జనవరి వరకు ప్రభుత్వం రూ. 8,581 కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,286 కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ముస్లిం మైనారిటీల సంక్షేమం, అధికారికంగా రంజాన్ పండుగ నిర్వహణ
గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా నిలిచిన తెలంగాణ సంస్కృతి, సామాజిక స్వరూపాన్ని మరింత ద్విగుణీకృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మొహర్రమ్, పీర్ల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయింది. అనేక దర్గాలకు హిందువులు వెళ్తారు. దేశంలో మైనారిటీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు భరోసానిస్తూ వారి సాంప్రదాయాలను, విశ్వాసాలను గౌరవిస్తూ రంజాన్ పండుగను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. అదే విధంగా 2015 నుండి ప్రతీ ఏటా రంజాన్ పండుగను పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో దావత్ ఇ ఇప్తార్ కార్యక్రమాన్ని, 2017 నుండి పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో బట్టల పంపిణీ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు స్వయంగా పాల్గొంటున్నారు.
షాదీ ముబారక్ పథకం :
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం షాదీ ముబారక్‌ పథకాన్ని 2014 నుంచి అమలు చేస్తోంది. గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో రెండు లక్షల 32వేల 713 మంది పెళ్లిళ్లకు1903 కోట్లను ఖర్చు చేసింది. పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా,150 కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ, ఈ సంవత్సరం 450 కోట్లు ప్రతిపాదిస్తున్నాము.
మైనారిటీ గురుకులాలు :
రాష్ట్రవ్యాప్తంగా వున్న మైనారిటీ విద్యార్థుల కోసం 408 రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నెలకొల్పింది. ఇందులో 204 ఉన్నత విద్యా పాఠశాలలు., వాటితో పాటు 204 జూనియర్ రెసిడెన్షియల్ కళాశాలలున్నాయి. ఈ జూనియర్ కాలేజీలు ప్రస్తుతం వున్న గురుకులాల క్యాంపస్ లోనే కొనసాగుతున్నాయి.
ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు :
“ముఖ్యమంత్రి విదేశీ విద్య స్కాలర్ షిప్ పథకం ’’ కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అర్హులైన మైనారిటీ విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం పూర్తి ఉచితంగా రూ.20 లక్షల గ్రాంటును అందిస్తున్నది. ఇప్పటివరకు 2701 మంది విద్యార్థులకు రూ.435 కోట్లను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.
అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణం :
ముస్లిం అనాథలకోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 39 కోట్లతో అనీస్ ఉల్ గుర్భా భవనాన్ని నిర్మించింది.
ఆజ్మీర్ లో రుబాత్ :
ముస్లింల పవిత్ర దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద తెలంగాణనుంచి సందర్శనకు వెళ్లిన భక్తుల సౌకర్యార్థం రుబాత్ (విశ్రాంతి భవనం) నిర్మించేందుకు రూ. 5 కోట్లు కేటాయించింది.
ఇమాం మౌజంలకు గౌరవ వేతనం :
ఇమామ్, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని అందిస్తున్నది. ఇమాంలు, మౌజామ్లకు నెలకు రూ. 5 వేల చొప్పున ఇప్పటివరకు రూ.60 కోట్లను విడుదల చేసింది. పేద ముస్లిం మహిళలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 20 వేల కుట్టుమిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మైనారిటీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈఆర్ధిక సంవత్సరానికి 270 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇది 2022-23 కన్నా239 కోట్లు ఎక్కువ.
ఇతర కార్యక్రమాలు

• పాతబస్తీలోని మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ, నవీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 8.48 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.
• మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కొత్తూర్ లోని జహంగీర్ పీర్ దర్గా సమగ్రాభివృద్ధి అవసరమైన భూ సేకరణ కోసం రూ. 50 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.
• హైదరాబాద్ లోని కోకాపేట్ లో బర్హానా షా సాహిబ్ ఖిబ్లా పరిసరాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, మహిళా సాధికారత కేంద్రం స్థాపనకు ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది.
• హైదరాబాద్ లోని కోకాపేటలో తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ స్థాపనకు రూ. 40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
• డ్రైవర్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రామ్ కింద మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ లు 941 కార్లను మైనార్టీలకు పంపిణీ చేశాయి.
• రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 12, టీచర్ల సంఖ్య 258, విద్యార్థుల సంఖ్య 5760 ఉండగా, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 192 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించడంతో పాటు 5,862 మంది టీచర్లను భర్తీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 204 కాగా, టీచర్ల సంఖ్య 6120. మొత్తం 97,920 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
• రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సంఖ్య 2, టీచర్ల సంఖ్య 28, విద్యార్థుల సంఖ్య 320 ఉండగా, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 202 మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలను స్థాపించడంతో పాటు 1616 మంది టీచర్లను భర్తీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సంఖ్య 204 కాగా, టీచర్ల సంఖ్య 1644. మొత్తం 32,640 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు.

క్రైస్తవుల సంక్షేమం

క్రైస్తవుల సంక్షేమానికి, వారి ఆధ్యాత్మిక జీవనాన్ని మెరుగుపరిచే వసతుల కల్పనకు, యువతకు స్వయం ఉపాధి కల్పనకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధన్యాతను ఇచ్చింది. ఈ దిశగా అమలు చేస్తున్న పథకాల పట్ల క్రైస్తవ సమాజం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.
అధికారికంగా క్రిస్మస్ పండుగ :
తెలంగాణలో క్రిస్మస్ ను రాష్ట్ర పండుగ‌గా ప్రభుత్వం జ‌రుపుతున్నది. ప్రతీ యేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 3 లక్షల మంది నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు అందజేస్తున్నది. అనంతరం 12వేల మందితో క్రిస్మస్ విందును అత్యంత వైభవోపేతంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. సీఎం కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ క్రిస్మస్ విందుకు క్రిస్టియన్ మత పెద్దలను, ముఖ్యులు హాజరవుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని చర్చిలలో (ఒక్కో చర్చికి రూ. 2 లక్షల చొప్పున కేటాయింపు) క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేసి, లౌకిక స్ఫూర్తిని చాటుకుంటున్నది.
క్రిస్మస్ (బట్టల పంపిణీ) కానుకలు
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి పెద్ద అన్నలా కెసిఆర్ బట్టలను కానుకలుగా అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 35 వేల మంది క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలను ప్రభుత్వం కానుకగా అందజేస్తున్నది. ఇందులో 2.80 లక్షల మంది పురుషులకు ప్యాంటు షర్టులు, 2 లక్షల 77 వేల 500 మంది మహిళలకు చీరెలు, 2 లక్షల 77 వేల 500 మంది బాలికలకు డ్రెస్ మెటీరియల్ ను ప్రభుత్వం ఇచ్చింది.
క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన :
ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి అత్యధిక నిధులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తున్నది.

చర్చిల నిర్మాణాలకు అనుమతులు సులభతరం, పునరుద్ధరణకు చర్యలు :
చర్చిల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలును కల్పించింది.
దీంతో కొత్తగా ఎన్నో చర్చిలు నిర్మితమయ్యాయి. మరికొన్ని చర్చిలకు మరమ్మతులు చేసి, ప్రహారీ గోడలు నిర్మించారు.

క్రిస్టియన్ మైనార్టీల కోసం డ్రైవర్ ఎంపవర్ మెంట్ స్కీం :
క్రిస్టియన్ మైనార్టీ యువతకు అండగా నిలిచేలా ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతున్నది. ఈ పథకం కింద నిరుద్యోగ క్రిస్టియన్లకు 60 శాతం సబ్సిడీతో కార్లను అందజేస్తున్నారు. కార్లను ట్రావెల్స్‌ గా, క్యాబ్ ల తరహాలోరెంటుకు నడుపుకొంటారు.
అధికారికంగా క్రిస్మస్ పండుగ
రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ ను రాష్ట్ర పండుగ‌గా గుర్తించి, ప్రతీ ఏటా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నది. క్రిస్మస్ విందుకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవుతారు. వీరితో పాటు క్రిస్టియన్ మత పెద్దలను, 12 వేల మంది క్రిస్టియన్లను ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని చర్చిలలో ఒక్కో చర్చికి రూ. 2 లక్షల చొప్పున కేటాయించి క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది.

క్రిస్మస్ (బట్టల పంపిణీ) కానుకలు
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఏడాది క్రైస్తవులకు కొత్త బట్టలను పంపిణీ చేస్తున్నది. 2022 క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.85 లక్షల మందికి క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేసింది.

క్రిస్టియన్ ఆత్మగౌరవ భవనం నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన
కోకాపేట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 10 కోట్లతో క్రిస్టియన్ భవన్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. దీంతో పాటు చర్చీలు, గ్రేవ్ యార్డుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నది.

చర్చిల నిర్మాణాలకు అనుమతులు సులభతరం, పునరుద్ధరణకు చర్యలు
చర్చిల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు చర్చిల నిర్మాణానికి కఠిన నిబంధనలుండేవి. తెలంగాణ ఏర్పాటయ్యాక మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, ప్రభుత్వం స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలును కల్పించింది. దీంతో కొత్తగా ఎన్నో చర్చిలు నిర్మితమయ్యాయి. మరికొన్ని చర్చిలకు మరమ్మతులు చేసి, ప్రహారీ గోడలు నిర్మించారు.
సిక్కుల కోసం గురుద్వారా నిర్మాణం
రంగారెడ్డి జిల్లా, రాజేందర్ నగర్ మండలం, నార్సింగి గ్రామంలో సిక్కు గురుద్వారా నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లకు పైగా విలువైన 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గురునానక్ 548వ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో నవంబర్ 4, 2017న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గురుద్వారా స్థల పత్రాలను సిక్కు మతగురువులకు అందజేశారు. ఈ కార్యక్రమాలతో పాటు సందర్భానుసారం ప్రభుత్వం పలు ఉత్సవాలు, కార్యక్రమాలకు నిధులను విడుదల చేస్తూ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ విల్లివిరిసేలా చర్యలు చేపడుతున్నది. జైనులకు మైనారిటీ కమిషన్ లో చోటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ద్వారా మైనారిటీల గుర్తింపులో రాష్ట్ర ప్రభుత్వ తన చిత్తశుద్దిని ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News