Friday, April 4, 2025
HomeతెలంగాణKeesara: తోటకూర వజ్రేష్ యాదవ్

Keesara: తోటకూర వజ్రేష్ యాదవ్

ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజా సంక్షేమం

మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ భారీ ర్యాలీతో కీసర మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలలో ముద్రపడిపోయిందని, తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలపై ప్రజలలో విస్తృత ప్రచారంతో పాటు గడప గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజి ఉపాధ్యక్షుడు ఉద్ధమర్రి నరసింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News