అక్రమ రవాణా జరగకుండా జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో 24 గంటలు పటిష్టమైన నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల వరి ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న PPC( paddy procurement centres/ ధాన్యం సేకరణ కేంద్రాలు) లకు రవాణా చేయకుండా నిరోధించడానికి సంబంధిత శాఖల అధికారులతో సంయుక్తంగా అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పాయింట్లను గురించి డిజీపీ అంజనీకుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సరిహద్దు జిల్లాలలోకి నిబంధనలు అతిక్రమించి ఇతర రాష్ట్రాలోని వరి ధ్యానం, మద్యం ఇతర అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమ రవాణా ను పూర్తిగా అరికడతామనని, జిల్లాలో 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ వివరించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ కలెక్టర్ మదుసుధన్ రావు, జి. జనార్దన్ రెడ్డి (ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్)జి.గణేష్ అసిస్టెంట్ కమీషనర్ (ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) జి. నాగేంద్ర రెడ్డి (జిల్లా ఎక్సైజ్ అధికారి) ట్రైనీ ఐపిఎస్ అవినాష్ కుమార్ , సివిల్ సప్లే అధికారులు బి. నాగేందర్, నరసింహారావు, ఏసీపీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.