అమెరికా వేదికగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రైతే రాజుగా ఉండాలని రైతు ఆత్మగౌరవంతో బతకాలని కెసిఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును తాము అధికారంలోకి వస్తేమూడు గంటలకే కుదిస్తామనడంతో రైతాంగం భగ్గుమంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. రైతులతో కలిసి వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నసమయంలో రైతాంగాన్ని, సమాజాన్ని ,పారిశ్రామిక రంగాన్ని చీకట్లో ఉంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ హయాంలో 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకుల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సండ్ర మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయిల్ మోటార్లతో, డీజిల్ ఇంజన్లతో, కరెంటు కోతలతో తెలంగాణ ప్రజానీకాన్ని అధోగతి పాలు చేసిందో తిరిగి మళ్లీ అదే దుస్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అమెరికా వేదికగా ఉచిత విద్యుత్తును తాము అధికారంలోకి వచ్చాక మూడు గంటలకు కుదిస్తామంటు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. కెసిఆర్ విజన్ తో 24 గంటల ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తూ భారతదేశానికే తిండి గింజలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రమని అన్నారు.